- యూపీలో దూసుకెళ్తున్న భాజపా- ఎగ్జిట్ పోల్స్ లెక్క పక్కా!
UP Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అధికార భాజపా స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. చెప్పినట్లుగానే సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
- పంజాబ్‌లో ఆప్ దూకుడు.. కాంగ్రెస్ బేజారు
Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.
- Atchenna on Mining: మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం: అచ్చెన్నాయుడు
Atchenna on Mining: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. అయితే ఆ లేఖ వెనక తెదేపా హస్తముందని వైకాపా నేతలు ఆరోపించడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
- ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైకాపా లీడర్ పోస్ట్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
Viral post in social media: వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. అధికార పార్టీ నేత పెట్టిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చట్టసభలకు ఎన్నికై మరణించిన వారికి సంతాపం తెలపటం సాంప్రదాయంగా కొనసాగుతుందని... నేడు అలాంటి సాంప్రదాయాలకు వైకాపా ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని.... గుంటూరుకు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సభ్యున్ని గౌరవించుకోవాలని హితవు పలికారు.
- Inam Lands in AP: ‘ఇనాం’ భూముల ద్వారా ఆదాయంపై ప్రభుత్వం దృష్టి..?
Inam Lands in AP : వివాదాస్పదంగా మిగిలిన ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సమస్యలను కొలిక్కి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటే.. ఖజానాకు నిధులు చేరుతాయని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేసేందుకు చర్యలు ప్రారంభించింది.
- చెత్త కుప్పలో ఐదు పిండాలు, మానవ శరీర భాగాలు..
Foetuses Dumped in Nagpur: నాగ్‌పుర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కాలనీలోని కాంపౌండ్ వాల్ సమీపంలో ఐదు పిండాలు, కొన్ని మానవ శరీర భాగాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు పోలీసులు తెలిపారు.
- ట్రంప్‌కు తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్!
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని ఓ ఇంజిన్ పనిచేయకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. గత శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.
- Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1000 ప్లస్
Stock Market : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 55,759 వద్ద ట్రేడవుతోంది.
- రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తో హృతిక్ పెళ్లి.. నిజమేనా?
Hrithik Roshan Saba marriage: స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ హీరోయిన్ సబా ఆజాద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అభిమానులందరికీ తీపి కబురు వినిపించనున్నారా? వీటికి సమాధానం చెప్పారు ఈ జంటకు సంబంధించిన ఓ కామన్ ఫ్రెండ్. ఇంతకీ ఏం చెప్పారంటే?
- న్యూజిలాండ్ ధనాధన్ బ్యాటింగ్.. భారత్ లక్ష్యం ఎంతంటే?