- అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తుపాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కోరనున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆగదు పోరాటం
విజయవాడలో ఐకాస నేతల మహా పాదయాత్ర ముగిసింది. పడవల రేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వరకు ర్యాలీ కొనసాగింది. ఈనెల 17న నిర్వహించే బహిరంగ సభకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రావాలని అమరావతి పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎన్నికలు నిర్వహించలేం
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ తరఫు న్యాయవాది.... కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతుల సమస్య మరింత దారుణంగా ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పరీక్షల ధరలు తగ్గాయ్
కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ.800 నుంచి 475 రూపాయలకు తగ్గించారు. ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో చేసే కరోనా టెస్టింగ్ ధరలను రూ.1000 నుంచి 499 రూపాయలకు తగ్గించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అసత్య ప్రచారాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన వ్యవసాయ చట్టాలపై ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా.. ఈ చట్టాలను రైతులు, విపక్ష నేతలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆయనే ముఖ్య అతిథి
వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానాన్ని.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. ఈ మేరకు డౌన్‌స్ట్రీట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనితోపాటు వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జీ-7 సదస్సుకు ప్రధాని మోదీకి.. బోరిస్ జాన్సన్ ఆహ్వానం పంపినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రంగం సిద్ధం!
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో 29వేల కోల్డ్ చైన్ పాయింట్స్, 240 వాక్ఇన్ కూలర్స్, 70 వాక్ఇన్ ఫ్రీజర్స్ ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అబ్బో.. ఎన్నెన్ని ముద్దులో!
- నేటి సినిమాల్లో నటీనటులు ముద్దులు పెట్టుకోవడం చాలా సహజం. కానీ, 92 ఏళ్ల నాటి మాటల్లేని సినిమాల్లోనూ ముద్దులు విరివిగా ఉన్నాయంటే నమ్మగలరా?. అవును ఓ సినిమాలో ఏకంగా 191 కిస్‌లు ఉన్నాయి. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండో స్థానానికి కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ జాబితాలో స్టీవ్ స్మిత్ తొలిస్థానంలో ఉండగా.. ఒకస్థానాన్ని మెరుగుపరచుకున్న కోహ్లీ రెండోస్థానానికి చేరాడు. బౌలింగ్‌లో పాట్ కమిన్స్.. ఆల్‌రౌండర్ జాబితాలో బెన్‌స్టోక్స్ తొలిస్థానాల్లో నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాణిజ్యలోటు తగ్గిందోయ్..!
దేశీయ ఎగుమతులు నవంబర్‌లో 8.74 శాతం తగ్గి.. 23.52 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులూ 13.32 శాతం క్షీణించి.. 33.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో దేశ వాణిజ్య లోటు గత నెల 9.87 శాతానికి దిగొచ్చినట్లు అధికారిక గణాంకాల్లో తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.