జగన్ ఏడాది పాలనలో బడుగు బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసించారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే అనితారాణి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా ఇష్టానుసారం మాట్లాడారని... వైద్యురాలి పట్ల వైకాపా నాయకులు అసభ్యంగా మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే అనితారాణి సీఐడీని తిరస్కరించారని... బాధితురాలి డిమాండ్ మేరకు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు