ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేడుకలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5.55 గంటలకు నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పురప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించున్నారు. స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మానించనున్నారు. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్‌తో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, వంటి లలితకళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ది చెందిన వంటకాలను ప్రజలకు అందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి :