రాష్ట్రంలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మరణాలు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బాధితుల సంఖ్య 8,47,977కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 6,828 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,761 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.20 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,915 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 70,405, ఇప్పటివరకు 88.63 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా మృతులు..
కరోనాతో కృష్ణాలో 3, అనంతపురంలో 2, చిత్తూరులో ఇద్దరు మృతి చెందారు. విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారని వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
జిల్లాల్లో కేసులు..
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 344 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 246, పశ్చిమ గోదావరి జిల్లాలో 227, చిత్తూరులో 198, గుంటూరులో 195, అనంతపురంలో 97, నెల్లూరులో 89, కడపలో 88, విశాఖలో 75, విజయనగరంలో 66, శ్రీకాకుళంలో 59, కర్నూలులో 24, ప్రకాశంలో 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: