ETV Bharat / city

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ap municipal elections 2021
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు
author img

By

Published : Feb 15, 2021, 10:35 AM IST

Updated : Feb 15, 2021, 5:58 PM IST

10:33 February 15

మార్చి 10న రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు: ఎస్‌ఈసీ

కరోనా కారణంగా 11 నెలల క్రితం నిలిచిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ రీషెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్​ను విడుదల చేశారు. మార్చి 10న..  12 కార్పొరేషన్లు, 57 పురపాలికలు, 18 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. నేటి నుంచి నగరాల్లోనూ కోడ్ రావడంతో రాష్ట్రం మొత్తం కోడ్ అమల్లోకి వచ్చింది.

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. వీటన్నింటికీ మార్చి 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చిన షెడ్యూల్ ప్రకారం..  మార్చి 2న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమవుతుంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. మార్చి 3న మధ్యాహ్నం 3 తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఒకే విడతలో కార్పొరేషన్‌, పురపాలక/నగర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న అన్నిచోట్ల పోలింగ్‌ నిర్వహిస్తారు. అవసరమైతే మార్చి 13న రీపోలింగ్‌ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.

రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు గతేడాది మార్చి 9న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ, పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీల్లోని వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఉపసంహరణ దశ నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈనెల 21న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం మార్చి 10 నుంచి పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

రాష్ట్రంలో మొత్తం 16 కార్పొరేషన్లకు గాను 12 చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 4 చోట్ల ఎన్నికలు జరగవు. పాలకవర్గం గడువు ముగియక కాకినాడ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరపడం లేదు. నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలు జరగడం లేదు. 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. పట్టణాల్లో 52.52 లక్షలమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు -12      

క్ర.సంజిల్లాకార్పొరేషన్
1విజయనగరం విజయనగరం
2విశాఖపట్నంగ్రేటర్ విశాఖపట్నం
3పశ్చిమగోదావరిఏలూరు
4కృష్ణావిజయవాడ
5కృష్ణామచిలీపట్నం
6గుంటూరుగుంటూరు
7ప్రకాశంఒంగోలు
8చిత్తూరుతిరుపతి
9చిత్తూరుచిత్తూరు
10కడపకడప
11కర్నూలుకర్నూలు
12అనంతపురంఅనంతపురం

రాష్ట్రంలో పురపాలక/నగర పంచాయతీలు కలిపి మొత్తం 104 ఉన్నాయి. వీటిలో 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీలు కలిపి మొత్తం 75 చోట్ల మాత్రమే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయిచింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 29 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. 75 పురపాలకలు, నగర పంచాయతీ పరిధిలో 2,123 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

  • ఎన్నికలు జరిగే మున్సిపాల్టీలు- 57 & నగర పంచాయతీలు -18
క్ర.సంజిల్లామున్సిపాలిటీనగరపంచాయతీ
1శ్రీకాకుళంఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గపాలకొండ
2విజయనగరంబొబ్బిలి, పార్వతీపురం, సాలూరునెల్లిమర్ల
3విశాఖపట్నంనర్సీపట్నం, ఎలమంచిలి-
4తూర్పు గోదావరిఅమలాపురం,మండపేట, పెద్దాపురం, పిఠాపురం,రామచంద్రాపురం, సామర్లకోట,తునిగొల్లప్రోలు, ముమ్మిడివరం,ఏలేశ్వరం,
5పశ్చిమ గోదావరి    కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం-
6కృష్ణానూజివీడు, పెడనఉయ్యూరు, తిరువూరు, నందిగామ
7గుంటూరుచిలకలూరిపేట, మాచర్ల, పిడుగురాళ్ల,  రేపల్లె, సత్తెనపల్లి,తెనాలి, వినుకొండ-
8ప్రకాశం చీరాల, మార్కాపురంఅద్దంకి,చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు
9నెల్లూరువెంకటగిరి, ఆత్మకూరు(ఎన్‌),సూళ్లూరుపేట, నాయుడుపేట-
10అనంతపురం  గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం,కల్యాణదుర్గం, గుత్తిపుట్టపర్తి, మడకశిర
11కర్నూలుఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, ఆళ్లగడ్డఆత్మకూరు(కె),గూడూరు(కె)
12కడపప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్‌, రాయచోటి, మైదుకూరుజమ్మలమడుగు,యర్రగుంట్ల
13చిత్తూరుమదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు-

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్యాలెట్‌ పత్రాలతోనే కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. పురపాలికలు, నగర పంచాయతీల నోటిఫికేషన్ విడుదలతో ఆ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్లైంది. 

ఇదీ చదవండి: పుర పోరు: రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో ఎన్నికలంటే..!

Last Updated : Feb 15, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.