ETV Bharat / city

ఎస్‌ఈసీతో సమావేశానికి పంచాయతీరాజ్‌ అధికారుల గైర్హాజరు - AP SEC NEWS

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar
author img

By

Published : Jan 22, 2021, 4:16 PM IST

Updated : Jan 22, 2021, 7:13 PM IST

16:12 January 22

ఎస్‌ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్​ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి పంచాయతీరాజ్‌ అధికారులు గైర్హాజరయ్యారు. సమావేశానికి రావాలంటూ పంచాయతీ రాజ్ ఉన్నతాధికారికి ఎస్​ఈసీ మెమో జారీ చేసినా స్పందన కరవైంది.

అసలేం జరిగిందంటే...?

శుక్రవారం ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్ కీలక అధికారులతో భేటీ ఏర్పాటు చేయాలని భావించారు ఎస్ఈసీ. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఉందని అధికారులు చెప్పటంతో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ సమావేశానికి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరు కాలేదు. వారి తీరుపై ఆగ్రహించిన రమేశ్ కుమార్... పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్​కు మెమో జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే భేటీకి తప్పక హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. అయినప్పటికీ సాయంత్రం 5 దాటినా అమరావతిలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అధికారులు చేరుకోలేదు. ఈ క్రమంలో ఎస్‌ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికలు: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం

Last Updated : Jan 22, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.