పట్టణ, స్థానిక సంస్థల్లో రెండో వైస్ ఛైర్మన్ల ఎన్నికకు ఎస్ఈసీ చర్యలు చేపట్టింది. అలాగే కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 11 మున్సిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న పురపాలికల్లో ప్రత్యేక భేటీ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. భేటీ విషయమై ఎక్స్ అఫిషియో, ఎన్నికైన సభ్యులకు తెలపాలని చెప్పింది. ఈ నెల 26లోపు సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండీ.. పిల్లలు దివ్యాగులని రెండో పెళ్లి చేసుకున్నాడు.. అంతలోనే మరో ట్విస్ట్!