కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేత అనంతరం ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మొదటి టెర్మ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు సూచించారు. మొదటి టెర్మ్ ఫీజును సైతం 2 వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించాలని పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. మొదటి త్రైమాసిక ఫీజు చెల్లించలేదన్న కారణంగా ఏ విద్యార్థి అడ్మిషన్‌ను నిరాకరించొద్దని కమిషన్ స్పష్టం చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి కమిషన్ ఫీజులు నిర్థరణ తర్వాత పూర్తి ఫీజు చెల్లింపులో సదరు విద్యార్థికి మినహాయింపు ఇవ్వాలని సూచనలు ఇచ్చింది.
'ఫీజులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశమివ్వండి' - ap schools fees in installement news
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి... ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించాలని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సూచించింది.
!['ఫీజులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశమివ్వండి' AP School Education](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6915172-1104-6915172-1587659689413.jpg?imwidth=3840)