ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలాశయాలకు జలకళ - andrapradesh rains news

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కృష్ణా జిల్లా గన్నవరంలో అకాల వర్షానికి ధాన్యం తడిచింది. కదిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. విశాఖ జిల్లాలో కురిసిన వర్షంతో జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.

ap rains
ఆంధ్రప్రదేశ్ వర్షాలు
author img

By

Published : May 12, 2021, 12:12 PM IST

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి.. ముస్తాబాద్‌, సావరగూడెం, సూరంపల్లి, నున్న గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. నెల రోజుల నుంచి పంటను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అడపాల వీధిలో నివాసాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెట్టు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడుగంటిన జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.

జలాశయాలకు జలకళ..

వేసవిలో అడుగంటిన జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మాడుగుల మండలం పెద్దేరు జలాశయం పరిధిలో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి 30 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 130.55 మీటర్లు ఉంది. చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రాంతంలో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ గెడ్డల నుంచి 20 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, 94.35 మీటర్ల మేర నీరుంది. మరోవైపు దిగువ కాలువలకు 20 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.