ETV Bharat / city

లాక్​డౌన్: నిర్లక్ష్య ధోరణికి లాఠీ దెబ్బ - రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసు కౌన్సిలింగ్

లాక్‌డౌన్‌ రెండో రోజున రాష్ట్రంలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. తొలి రోజున రోడ్లపైకి వాహనాలు విపరీతంగా వచ్చాయి. ఇవాళ వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కాపు కాశారు. ప్రజల క్షేమం కోసం వారిని ఇంట్లోనే ఉంచేందుకు పోలీసులు అనేక చోట్ల లాఠీకి పనిచెప్పక తప్పలేదు. కరోనాపై పూర్తి అవగాహన కల్పించేందుకు రోడ్లపైకి వచ్చిన యువతతో రోడ్డుపైనే గుంజీలు తీయించారు.

Ap  police taken stringent action on lock down violated youth
నిర్లక్ష్య ధోరణికి లాఠీ దెబ్బ.. లాక్​డౌన్​కు ఖాకీ తోడు
author img

By

Published : Mar 24, 2020, 10:02 PM IST

లాక్​డౌన్: నిర్లక్ష్య ధోరణికి లాఠీ దెబ్బ

లాక్‌డౌన్‌ రెండో రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించగా... అక్కడక్కడ ప్రజలు వారి వాహనాలపై రోడ్లమీదకు వచ్చారు. వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారు.

ఉత్తరాంధ్రలో...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిసి వీధుల్లో గస్తీ నిర్వహించారు. నిత్యావసరాలు కాని దుకాణాలను మూసివేయించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో ఎక్కడికక్కడ పోలీసులు ద్విచక్రవాహనదారులను ఆపి సరైన కారణం చెప్తేనే అనుమతించారు. ఎక్కడా జనం పోగవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇతర ఊళ్ల వారు ప్రవేశించకుండా ముళ్లకంచెలు వేశారు. విశాఖలో నిష్కారణంగా రోడ్లపైకి వచ్చిన యువతతో పోలీసులు గుంజీలు తీయించారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో...

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, రాజమహేంద్రవరంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులను అడ్డుకున్న పోలీసులు... మైకు ద్వారా అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి-నరసాపురం, లింగపాలెం మండలాల్లోని వివిధ గ్రామాల్లో, సరిహద్దుల్లోనే ప్రజలు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. బుట్టాయగూడెం మండలం కోయ అంకంపాలెం గ్రామం స్వీయ నిర్బంధంలోనే సాగింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో...

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. 144 చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లాఠీ ఝళిపించారు. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు సహకరించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. నిత్యావసరాలు కాని దుకాణాలను బంద్‌ చేయించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరులపాడు మండల జగన్నాథపురం జుజ్జూరు గ్రామస్థులు వారి ఊరి సరిహద్దు వద్ద కంచె ఏర్పాటు చేసి తమ గ్రామంలోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాలపై పోలీసులు కొరడా ఝళిపించారు.

రాయలసీమలో...

రాయలసీమలోనూ అన్ని జిల్లాల్లో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా ఎక్కడికక్కడ గస్తీ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుర్రకారుపై లాఠీ ప్రయోగించారు. సరదాగా బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : కరోనాకు బేరాల్లేవమ్మా.. చంపేయటాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.