సీఎం జగన్ మాట్లాడకుండానే గవర్నర్‌తో అవాస్తవాలు చెప్పించారని.. ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. హైదరాబాద్లో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కొత్తగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏం వచ్చాయో చెప్పాలన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి సాధించడంలో ప్రభుత్వం గొప్పేమీ లేదని.. వర్షాలు పడటంతో వృద్ధి నమోదైందని తెలిపారు.
అభివృద్ధి అంటే పథకాల పేర్లు మార్చడమేనా?
గవర్నర్‌తో అన్ని అర్ధ సత్యాలు, సత్య దూరాలు చెప్పించారని శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే... కాంగ్రెస్ పథకాల పేర్లు, సంఖ్య మార్చడమేనా అంటూ ప్రశ్నించారు. సాగునీటి రంగంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
వితండవాదమే
పదోతరగతి పరీక్షలు నిర్వహించొద్దని ఎంత మంది చెప్పినా నిర్వహించి తీరుతాం అంటున్నారని.. దీనిపై వితండవాదం చేయడంలో అర్ధం లేదని అసహనం వ్యక్తంచేశారు. విద్యార్ధులకు ఏమైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారన్నారు. 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నామని గవర్నర్‌తో చెప్పించారని.. ఇంతవరకు జరిగిన నియామకాల్లో కీలకమైన పదవులు ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...