ETV Bharat / city

"ఏపీలో రేషన్‌ లబ్ధిదారుల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు" - పార్లమెంట సమావేశాల్లో ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ బియ్యం అందించే లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీకొచ్చిన ప్రతిసారీ చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. లబ్ధిదారుల సంఖ్యను సవరించడం సాధ్యం కాదని బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు వంగా గీత, బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి సమాధానమిచ్చారు.

parlaments
సభలో ఎంపీలు
author img

By

Published : Jul 21, 2022, 7:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ బియ్యం అందించే లబ్ధిదారుల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని కేంద్ర సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి అన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 కింద గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణ ప్రాంతాల్లో 50% మందికి సబ్సిడీ బియ్యం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96% మందికి, పట్టణ ప్రాంతాల్లో 41.14% మందికి అందిస్తున్నామన్నారు.

"ఆంధ్రప్రదేశ్‌లో 2.68 కోట్లమందికి సబ్సిడీ ఆహారధాన్యాలు ఇవ్వాలని గుర్తించగా, రాష్ట్ర ప్రభుత్వం వీరందర్నీ లబ్ధిదారులుగా చేర్చింది. గత ప్రణాళికా సంఘం ఏపీ లబ్ధిదారుల సంఖ్యను గరిష్ఠంగా పై మేరకు నిర్ధారించింది. వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధాన్యాన్ని అందిస్తోంది. 2.68 కోట్లకు మించి అదనంగా ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరుల నుంచి ఆహారధాన్యాలు ఇచ్చుకోవచ్చు. ప్రణాళికా సంఘం నిర్ణయించిన విధానాన్ని అన్ని రాష్ట్రాలకూ ఒకే విధంగా వర్తింపజేసినందున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటే ఆ కొలమానాన్ని మార్చడం సాధ్యం కాదు...’’ అని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి స్పష్టం చేశారు.

600% పెరిగిన మాదకద్రవ్య బానిసలు: ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్య బానిసల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ (ఎన్‌ఏపీడీడీఆర్‌) కింద కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక ప్రయోజనం పొందిన లబ్ధిదారుల (ఎక్స్‌ డ్రగ్‌ అడిక్ట్స్‌) సంఖ్య గత మూడేళ్లలో 600% పెరగడమే అందుకు నిదర్శనం. అస్సాం ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి ఎ.నారాయణస్వామి ఇచ్చిన సమాధానం ప్రకారం ఎన్‌ఏపీడీడీఆర్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో నుంచి ప్రయోజనం పొందిన మాదకద్రవ్య బానిసల సంఖ్య 2019-20లో 2,063 ఉండగా... 2020-21లో ఆ సంఖ్య 6,878కి, 2021-22లో 15,295కి చేరింది. తెలంగాణలో ఇలాంటివారు 2019-20లో 1,952, 2020-21లో 5,924, 2021-22లో 6,620 మంది మాత్రమే ఉన్నారు.

పాఠశాలల విలీనాన్ని నిలిపేయించండి: నూతన విద్యా విధానాన్ని సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలను విలీనం చేసి పిల్లలను చదువులకు దూరం చేస్తున్నందున దీనిని నిలిపేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండు చేశారు. ఆయన బుధవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.

‘పాఠశాలలను విలీనం చేసి, టీచరు పోస్టులను తగ్గించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. 1, 2 తరగతులను అంగన్‌వాడీల్లో విలీనం చేస్తున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలతో అనుసంధానం చేస్తున్నారు. తమ బిడ్డలు చదువుతున్న పాఠశాల రేపు ఉంటుందో లేదో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు-ఉపాధ్యాయ నిష్పత్తి మరింత దిగజారుతోంది. నాణ్యమైన విద్య అనే భావన ఆవిరైపోతోంది. తల్లిదండ్రులు, విద్యార్థుల నిరసనలను లెక్కచేయకుండా ఏపీ ప్రభుత్వం విలీన ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని సాకుగా చూపుతోంది. ప్రాథమిక పాఠశాలల విచ్ఛిన్నతను జాతీయ విద్యావిధానం, విద్యా హక్కు చట్టం సిఫార్సు చేయలేదని నేను భావిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలి’ అని రామ్మోహన్‌ నాయుడు డిమాండు చేశారు.

బీచ్‌ కారిడార్‌పై నిర్ణయం తీసుకొంటాం: విశాఖపట్నం-భోగాపురం మధ్య తలపెట్టిన బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఆయన జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ఉన్న బీచ్‌ రోడ్డును భోగాపురం, రిషికొండ, భీమిలి మీదుగా ఎన్‌హెచ్‌16తో అనుసంధానిస్తూ ఆరు వరుసల రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారీకి జాతీయ రహదారుల సంస్థ ఏజెన్సీని నియమించిందని చెప్పారు. ఇందులో వెల్లడయ్యే ఫీజిబిలిటీ ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు నుంచి మల్లవరం వరకు ఉన్న 61.128 కిలోమీటర్ల జాతీయ రహదారిలో ఇప్పటి వరకు 59.822 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయినట్లు తాత్కాలిక ధ్రువీకరణ పత్రాన్ని గత ఏడాది మే 10న జారీ చేసినట్లు చెప్పారు. నందిగామ, కంచికచర్ల బైపాస్‌ను 2 నుంచి 6 వరుసలకు విస్తరించే పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 452 బ్లాక్‌స్పాట్స్‌లో 388 స్పాట్స్‌ను సరిదిద్దినట్లు చెప్పారు.

ఏపీ విద్యాసంస్థల్లో 68 పోస్టులు ఖాళీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ ఐఐఎంలో 27, తిరుపతి ఐఐటీలో 15, కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎంలో 6, తాడేపల్లి గూడెంలోని ఎన్‌ఐటీలో 20 కలిపి మొత్తం 68 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఛాలెంజ్‌ పద్ధతిలో పీఎంమిత్ర పార్కుల ఎంపిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన పీఎం మిత్రపార్కును ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శనా జర్దోసి తెలిపారు. ఆమె బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ పార్కుల తుది స్థలాలను ఛాలెంజ్‌ పద్ధతిలో ఎంపిక చేయన్నునట్లు వెల్లడించారు. ఏపీలోని 11 పాత జిల్లాల నుంచి 2021-22లో 770.62 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల జౌళి ఉత్పత్తులు ఎగుమతి అయినట్లు చెప్పారు.

తూర్పుకాపులను ఓబీసీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పుకాపులు, గాజుల కాపులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రతిపాదనలూ అందలేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్‌ తెలిపారు. ఆమె బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

ఏపీలో 6,913 కి.మీ., తెలంగాణలో 3,795 కి.మీ జాతీయ రహదారులు: దేశంలో 2019 మార్చి 31 నాటికి 1,32,499 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 6,913 కిలోమీటర్లు (5.2%), తెలంగాణలో 3,795 కిలోమీటర్లు (2.9%) ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర రహదారులు దేశవ్యాప్తంగా 1,79,535 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 13,500 కిలోమీటర్లు (7.52%) ఉన్నట్లు పేర్కొంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌ల తర్వాతి స్థానాన్ని ఏపీ ఆక్రమించినట్లు పేర్కొంది. తెలంగాణలో స్టేట్‌ హైవేస్‌ 2,149 (1.20%) కి.మీ మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఏపీకి రూ.2,635 కోట్లు, తెలంగాణకు రూ.854 కోట్లు: జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద 2015-16 నుంచి 2019-20 వరకు అయిదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,635.35 కోట్లు, తెలంగాణకు రూ.854.76 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అదే కాలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో కేంద్ర వాటాగా ఏపీకి రూ.1,822.50 కోట్లు, తెలంగాణకు రూ.909 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2021లో మార్చి 31 నాటికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఏపీకి రూ.657.209 కోట్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఏపీకి రూ.1,119 కోట్లు, తెలంగాణకు రూ.449 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

ఎగుమతులతో రైతులు లబ్ధిపొందే విధానాన్ని రూపొందించాలి: రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి ప్రత్యక్షంగా లబ్ధి పొందే విధానాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నంద్యాల లోక్‌సభ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు. 377 నిబంధన కింద బుధవారం ఈ అంశాన్ని ఆయన లోక్‌సభ ముందుంచారు. ప్రపంచవ్యాప్తంగా సాగు ఉత్పత్తుల ఎగుమతిలో దేశం క్రమంగా పురోగతి సాధిస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం 2019-20లో దేశ వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.2.52 లక్షల కోట్లని పేర్కొన్నారు. గతంలో ఒక శాతంగా ఉన్న ఎగుమతులు 2019 నాటికి 3.1 శాతానికి చేరుకున్నాయని వివరించారు. దేశీయ డిమాండ్‌కు మించి ఎగుమతులు ఉన్న నేపథ్యంలో భారీగా ఆదాయం ఆర్జించడానికి అవకాశాలున్నాయని తెలిపారు. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తి, శుద్ధి, రవాణా, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు ఒక ప్రత్యక్ష ఛానెల్‌ను రూపొందించాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.