ETV Bharat / city

'ఈ నెల 8 నుంచి హోటళ్లకు సడలింపు' - minister avanthi comments on tourism policy

రాష్ట్రంలో నూతన పర్యాటక విధానం అమలు చేయనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్​ తెలిపారు. పబ్లిక్​, ప్రైవేట్​ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

'పబ్లిక్​, ప్రైవేట్​ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధి'

author img

By

Published : Jun 2, 2020, 4:46 PM IST

Updated : Jun 2, 2020, 7:06 PM IST

ఈనెల 8 నుంచి లాక్​డౌన్​లో హోటళ్లకు నియమ నిబంధనల సడలింపు ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్​ ప్రకటించారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా హోటళ్లు నడిపే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను పునఃప్రారంభించడంపై ఒకటి రెండు రోజులో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకొస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పెట్టుబడిదారులకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందని అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో యువజనోత్సవాలు జరిపి వారిని మరింత ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

'సీఎం జగన్​ను సలహాదారులే పక్కదారి పట్టిస్తున్నారు'

Last Updated : Jun 2, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.