ప్రకటనలోని సారాంశం...
కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న లేఖ సాధారణ పాలనా ప్రక్రియలో భాగం. అఖిల భారత సర్వీసు అధికారులను ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు కేంద్రానికి నివేదించడం తప్పనిసరి. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం ఆ సస్పెన్షన్ను ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు. ఆమోదించని పక్షంలో సస్పెన్షన్ ఏమీ రద్దు కాదు... రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన 30 రోజుల్లోగా క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన అభియోగపత్రం సస్పెండ్ అయిన అధికారికి అందజేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సస్పెన్షన్ రద్దవుతుంది.
-ఏబీ వెంకటేశ్వరరావు
![AP IB former chief Venkateswara rao react on suspend letter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6336449_letter.jpg)
సస్పెన్షన్ను కేంద్రం ఆమోదించిన పక్షంలో అధికారికి అభియోగపత్రం జారీ చేయడానికి ఇంకో 30 రోజుల వరకు సమయం ఇచ్చే అధికారం ఉంది. ఇప్పుడు జరిగింది అదే. కిందటి నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నా సస్పెన్షన్ గురించిన నివేదికను కేంద్రానికి పంపింది. నేను కూడా 27న వివరణ ఇస్తూ... సస్పెన్షన్ను ఆమోదించవద్దని కేంద్ర హోంశాఖలో అర్జీ ఇచ్చాను. హోంశాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న లేఖలో నేను ఇచ్చిన అర్జీ ప్రస్తావన ఎక్కడా లేదు.
-ఏబీ వెంకటేశ్వరరావు
సెలవు రోజున లేఖ జారీ చేయడం ఒకింత ఆశ్చర్యకరమే. ఈ లేఖ వల్ల కొత్తగా జరిగిందేమీ లేదు. ఈ లేఖ ద్వారా కేంద్రమేమీ నా మీద వచ్చిన ఆరోపణలు నిజమని తాము నమ్ముతున్నట్లుగా చేస్తున్న ప్రచారం అబద్ధం. లేఖ చదివితే తెలిసేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నాకు అభియోగపత్రం ఇవ్వడానికి ఏప్రిల్ 7 వరకు గడువిచ్చారు. నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి ఉన్న పాలనా పరమైన అధికారాల్లో ఒకటి. నా అర్జీని కనీసం ప్రస్తావించకుండా నిర్ణయం ప్రకటించడం న్యాయం కాకపోయినప్పటికీ... దీని గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వృథా అని న్యాయ వృత్తిలో ఉన్న మిత్రులు ఇచ్చిన సలహా. ఈ మేరకు దీన్ని ఇంతటితో వదిలేస్తున్నాను.
-ఏబీ వెంకటేశ్వరరావు