విజయవాడలో నిర్మించ తలపెట్టిన రెండో పైవంతెన విషయంలో వైఖరి తెలుపుతూ పూర్తి వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర రహదారులు, రవాణాశాఖ కార్యదర్శి, ఏపీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్హెచ్ఐ ఛైర్మన్, విజయవాడలోని జాతీయ రహదారుల అథారీటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు నోటీసులు జారీచేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన దర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. స్థానిక ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి అధ్యయనం చేకుండా రెండో పైవంతెన ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై . బసవేశ్వరరావు వేసిన పిల్‌పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: