ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రైవేశాలను తాము నిలువరించడం లేదని విద్యా శాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ హైకోర్టుకు నివేదించారు .తాము జారీచేసిన ఉత్తర్వులు విద్యార్థుల ప్రవేశాలు , విద్యాభ్యాసంపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది .హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది . ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఆర్థిక సాయం నిలిపేయాలని నిర్ణయించిన ప్రభుత్వం .. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని , లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టానికి సవరణ చేస్తూ ఈ నెల 6 న ఆర్డినెన్స్ 12/2021 తీసుకొచ్చింది .ఈ వ్యవహారంపై యాజమాన్యాలు సమ్మతి తెలుసుకోవాలని కళాశాల విద్య కమిషనర్ ను ఆదేశిస్తూ ఈ నెల 10 న జీవో 42 ను జారీ చేసింది. ఆర్డినెన్స్ , జీవో 42 ను సవాలు చేస్తూ ఎన్ఎస్ కార్యకర్తలు షేక్ నాగూ మరో ఆరుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు .పిటిషనర్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ .. "ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు . అలాంటి విద్యాసంస్థలకు ఎయిడ్ ను నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఏకపక్షం . ప్రభుత్వ చర్యలో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది .ఎయిడ్ నిలిపేస్తే ప్రైవేటు విద్యా సంస్థలు అధిక మొత్తంలో రుసుములు వసూలు చేస్తాయి . విద్యార్థులకు నష్టం జరుగుతుంది . ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటిని ప్రభుత్వం లాగేసుకోవాలనుకుంటోంది . విద్యా సంస్థల యాజమాన్యాల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు . ప్రభుత్వ ఇచ్చిన సర్క్యులర్ తో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఆగిపోయాయి" అన్నారు. విద్యా శాఖ రఘువీర్ వాదనలు వినిపిస్తూ .. "ప్రభుత్వం గ్రాంట్ ఇస్తున్నా కొన్ని ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో తగిన విధంగా మౌలిక సదుపాయాలు , విద్యార్థుల ప్రవేశాలు లేవు . ప్రభుత్వ ఉత్తర్వులతో విద్యార్థుల ప్రవేశాలకు ఎలాంటి ఆటంకం లేదు . విద్యా సంస్థలను నిర్వహించలేని యాజమాన్యాల నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకునేందుకు సమ్మతిని తెలుసుకుంటున్నాం .ఏ యాజమాన్యాన్ని బలవంతం చేయడం లేదు . పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు .
ఇదీ చదవండి: