ETV Bharat / city

'వివేకా హత్య కేసు బెయిల్​ పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ చేపట్టలేం' - హైకోర్టులో వివేక హత్య కేసు నిందితుల బెయిల్​ పిటిషన్​

HC on Viveka Murder Case Victims Bail Petition: మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుల బెయిల్​ పిటిషన్లపై ప్రస్తుతం పూర్తిస్థాయి విచారణ చేపట్టలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ స్పష్టం చేశారు. పిటిషన్లు వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్​ విచారణకు పంపే వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సంబంధిత ఫైళ్లను సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

వివేక హత్య కేసు నిందితుల బెయిల్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ
APHC on Viveka Murder Case
author img

By

Published : May 7, 2022, 6:07 AM IST

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తగిన సమయం లేకపోవడంతో వ్యాజ్యాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ స్పష్టం చేశారు. ఈ పిటిషన్లు వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్​ విచారణకు పంపే వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సంబంధిత ఫైళ్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని న్యాయమూర్తి.. రిజిస్ట్రీని ఆదేశించారు. నిందితుల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. బెయిలు పిటిషన్లను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. వెకేషన్ బెంచ్ వద్దకు విచారణకు వేయాలని కోరారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఏ2 సునీల్ యాదవ్, ఏ3 గజ్జల ఉమాశంకర్రెడ్డి, ఏ5 జీవరెడ్డి శివశంకర్ రెడ్డి.. బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ వద్దకు విచారణకు వచ్చాయి. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గతంలో దాఖలు చేసిన బెయిలు పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి వద్దకే ప్రస్తుత వ్యాఖ్యలు విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సింగిల్ జడ్జి వద్ద అభ్యంతరం లేవనెత్తారన్నారు. దీంతో హైకోర్టు సీజే .. ఈ వ్యాజ్యాలను ప్రస్తుత బెంచ్ వద్దకు విచారణకు పంపారన్నారు. న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ స్పందిస్తూ.. వేసవి సెలవులు ప్రారంభం కావడానికి శుక్రవారం హైకోర్టు చివరి పనిదినం కావడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టడం సాధ్యంకాదన్నారు. ప్రస్తుత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైళ్లను సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇదీ చదవండి: ముగ్గురు ఐఏఎస్​లకు.. జైలుశిక్ష విధించిన హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.