వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బాధ్యులకు నోటీసులు ఇచ్చి, జరిమానా వసూలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మరిన్ని చర్యల వివరాలతో అఫిడవిట్ వేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
కొవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోడానికి త్వరలో విలేజ్ క్లినిక్‌లు: సీఎం