రాజధాని కోసం రైతులిచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తెలిపింది. రైతుల నుంచి సమీకరించిన భూమిలో... పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల చేయాలనే అంశాన్ని వదిలేసి... సమీకరించిన భూమిలో 5 శాతం ఇళ్ల స్థలాలు ఇస్తామనడం సరికాదని స్పష్టం చేసింది. చట్టంలో నచ్చిన అంశాన్ని తీసుకుని మిగిలిన వాటిన విస్మరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
'రాజధాని భూముల పంపిణీ సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధం' - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
రాజధాని భూముల పంపిణీ సీఆర్‌డీఏ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది.
రాజధాని కోసం రైతులిచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తెలిపింది. రైతుల నుంచి సమీకరించిన భూమిలో... పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల చేయాలనే అంశాన్ని వదిలేసి... సమీకరించిన భూమిలో 5 శాతం ఇళ్ల స్థలాలు ఇస్తామనడం సరికాదని స్పష్టం చేసింది. చట్టంలో నచ్చిన అంశాన్ని తీసుకుని మిగిలిన వాటిన విస్మరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఇవీ చూడండి-కరోనా ఎఫెక్ట్.. రాష్ట్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు