ETV Bharat / city

ap high court: ఎస్ఈసీ వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు: హైకోర్టు

ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​ విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

SEC Nilam Sawhney
SEC Nilam Sawhney
author img

By

Published : Jul 19, 2021, 9:42 PM IST

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, డివిజన్ బెంచ్ కి బదిలీ చేయాలని ఎస్​ఈసీ న్యాయవాది కోరారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇది ప్రజా ప్రయోజనాల కిందకి వస్తుందని గతంలో పలు జడ్జిమెంట్లు ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. జడ్జిమెంట్లు ఫైల్ చేయాలని పిటిషనర్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి ధర్మాసనం వాయిదా వేసింది.

కేసు ఏంటంటే..?

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నితో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.

రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం కమిషనర్‌గా రాజ్యాంగబద్ధ పదవి చేపట్టేందుకు పదవీ విరమణ తర్వాత కనీసం మూడేళ్ల గడువు ఉండాలని వ్యాజ్యంలో ప్రస్తావించారు. అధికరణ 243 కే ప్రకారం నీలం సాహ్ని నియామకం జరగలేదని పేర్కొన్నారు. ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని వివరించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 28న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ జీవో ఇచ్చారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.