రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌ఈసీగా విశ్రాంత జడ్జిని నియమించాలని నిర్ణయించామని హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చామని.. మిగతా రాష్ట్రాల ఎస్‌ఈసీల కాలపరిమితి వివరాలు వెల్లడించింది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని... పోలీసులు, పాలనా యంత్రాంగంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఎస్‌ఈసీ పదవి నుంచి కావాలనే తప్పించారని వేసిన పిటిషన్ అవాస్తవమని కోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండి: 'అత్యవసర పరిస్థితి లేనప్పుడు ఆర్డినెన్స్ ఎలా తెస్తారు?'