జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్‌ను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సెప్టెంబరు 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ, మండల ప్రజా పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న మదర్సాల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. 2020-21 విద్యా సంవత్సరానికి డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు, వివిధ అంశాలను నేర్చుకునే నైపుణ్యాలను పెంచేందుకు జగనన్న విద్యా కానుక పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి