రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తా నియమించింది. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొంది. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్గా జి. ఎస్. నవీన్ కుమార్ని నియమించారు.
ఇదీ చదవండి