ETV Bharat / city

తొలి మూడు నెలల్లోనే మూడింత రెండొంతుల అప్పు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రుణలక్ష్యంలో రాష్ట్రం ఇప్పటికే 68 శాతం అప్పు సమీకరించింది. తొలి త్రైమాసికంలో రూ.33 వేల 294 కోట్లు అప్పులు తీసుకుంది. కాగ్ లెక్కలతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది మొత్తంలో చేయాల్సిన అప్పులో మూడింట రెండొంతులు తొలి మూడు నెలల్లోనే తీసుకుంది. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయిందని ప్రభుత్వం చెబుతుంది. పింఛన్లు, సంక్షేమ పథకాలు, జీతాల కోసం రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తాయని అధికారులు అంటున్నారు.

తొలి మూడు నెలల్లోనే మూడింత రెండొంతుల అప్పు
తొలి మూడు నెలల్లోనే మూడింత రెండొంతుల అప్పు
author img

By

Published : Aug 30, 2020, 6:00 AM IST

రాష్ట్రంలో తొలి త్రైమాసికంలోనే ప్రభుత్వం ఏకంగా 33 వేల 294 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమీకరించింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రుణలక్ష్యంలో 68 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. ఏడాది మొత్తం చేయాలనుకున్న అప్పులో మూడింట రెండొంతుల అప్పును తొలి మూడు నెలల్లోనే తీసుకురావాల్సి వచ్చింది. పైగా ఈ 3 నెలల్లో ప్రభుత్వం చేసిన ఖర్చుల్లో ఏకంగా 60 శాతం అప్పు రూపంలో తెచ్చిన సొమ్మునే ఖర్చు చేసింది. మరోవైపు రూ.27 వేల 67కోట్లు రెవెన్యూ లోటుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు 21 వేల 74 కోట్లు కాగా... రెవెన్యూ ఖర్చు రూ.48 వేల 142 కోట్లగా ఉంది. మొత్తం ఖర్చు రూ.54 వేల 335 కోట్లుగా ఉంటే. అందులో పెట్టుబడి వ్యయం రూ.6 వేల 193కోట్లుగా ఉంది.

ప్రభుత్వానికి సొంత పన్నుల రూపంలో... మూణ్నెళ్లలో రూ.12 వేల 531 కోట్లు ఆదాయం వచ్చింది. దీన్ని జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు సహా... ఇతర పన్నుల ఆదాయం కలిపితే వచ్చిన ఆదాయంగా లెక్కగట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్షా 2 వేల 917 కోట్ల రెవెన్యూ వసూళ్లు ఉంటాయని అంచనా వేయగా... తొలి 3 నెలల్లో అందులో 12 శాతం మాత్రమే రాబట్టగలిగారు.

రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం కరోనా వైరసేని అధికారులు వివరించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఆదాయాల్లో ఆశించిన సగమైనా రాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో పెరుగుదల మాట అటుంచింతే అంతకుముందున్న ఆదాయాలూ గణనీయంగా పడిపోయాయి. మరోవైపు కిందట ఏడాది నుంచి ఆర్థిక కార్యాకలాపాలూ తగ్గిపోయి ఆదాయం తగ్గుముఖం పట్టినట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు, కొన్ని సందర్భాల్లో జీతాల కోసమో రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఫలితంగా రుణాల శాతం పెరిగింది. మరోవైపు కరోనాను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అందులో ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిమితి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చుకునే అవకాశం కల్పించింది. ఆ మేరకు రుణాల మొత్తం పెరగనుంది.

ఇదీ చదవండి : సీలేరు జలపాతమా... భూతల స్వర్గమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.