రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ స్థాయిలో మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి ఉత్పత్తుల మార్కెట్ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. ఉద్యాన పంటలతో పాటు ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర రైతుల ప్రయోజనాల మేరకే వివిధ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలా పనిచేస్తున్నామో... అదేవిధంగా రైతుల గురించి సైతం ప్రభుత్వం అలానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొందరు ఈ అంశంపై పనిగట్టుకుని దుష్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిశ్రమలు ఉత్పత్తిని నియంత్రించుకోగలవని తద్వార నష్టాలను తగ్గించుకునే అవకాశముంటుందన్నారు. అయితే రైతులు తమ ఉత్పత్తులను హఠాత్తుగా తగ్గించుకునే వీలు లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
'మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా పంట ఉత్పత్తుల సమాచారం' - మంత్రి కన్నబాబు లేటెస్ట్ న్యూస్
గ్రామీణ స్థాయిలో మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా సమాచారం సేకరించి పంట ఉత్పత్తుల మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కరోనా ప్రభావంతో ఏ రైతుకూ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ స్థాయిలో మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి ఉత్పత్తుల మార్కెట్ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. ఉద్యాన పంటలతో పాటు ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర రైతుల ప్రయోజనాల మేరకే వివిధ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలా పనిచేస్తున్నామో... అదేవిధంగా రైతుల గురించి సైతం ప్రభుత్వం అలానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొందరు ఈ అంశంపై పనిగట్టుకుని దుష్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిశ్రమలు ఉత్పత్తిని నియంత్రించుకోగలవని తద్వార నష్టాలను తగ్గించుకునే అవకాశముంటుందన్నారు. అయితే రైతులు తమ ఉత్పత్తులను హఠాత్తుగా తగ్గించుకునే వీలు లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి-ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు నష్టపోతారు: అయ్యన్న