అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వ్యతిరేకంగా... రాజధాని రైతు పరిరక్షణ సమితితో పాటు ఇతరులు దాఖలు చేసిన కేసుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో దాఖలైన ఈ కేసులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించినందుకు గానూ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డికి 88 లక్షల రూపాయలను ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ సీఆర్డీఏకు చెందిన నిధుల నుంచి ఈ చెల్లింపులు చేస్తూ... ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది ఆగస్టు 4 తేదీ నుంచి 2020 డిసెంబరు 14 తేదీ వరకూ 20 రోజుల పాటు ఆయన హైకోర్టులో హాజరైనందుకు గానూ రూ.88 లక్షలను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టులో ఆయన ఈ కేసుల నిమిత్తం హాజరైనందుకు గానూ ఒక్క రోజుకు 4 లక్షల 40 వేల రూపాయల చొప్పున 20 రోజులకూ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఇదీ చదవండీ... సీఎం జగన్పై తెలంగాణ మంత్రులు ఫైర్.. ఏమన్నారంటే..!