ETV Bharat / city

సీపీఎస్ రద్దుపై పోరుకు సిద్ధమైన ఉద్యోగులు, పోలీసుల నోటీసులు - పోలీసుల నోటీసులు

CPS Cancellation సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. అందులో భాగంగా సెప్టెంబరు 1వ తేదిన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం, సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను అడ్జుకోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, హాజరు కావటం నేరమని పోలీసులు నోటిసులు జారీ చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఈ చర్యలు చేపడుతున్నారని వారు వాపోయారు.

CPS Cancellation
సీపీఎస్ రద్దు
author img

By

Published : Aug 26, 2022, 8:11 PM IST

Police Notices to Employees: సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబరు 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ చేయని చర్యలు చేపట్టింది. బస్సులు రైళ్లలో ఉద్యోగులు రిజర్వేషన్లు చేయించుకున్నారా అనే వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ వాహనాల్లోనూ తరలి వెళ్లకుండా చూస్తోంది. ప్రయివేటు వాహనాల యజమానులకు.. వాహనాలు అద్దెకు ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం ఉద్యోగులకు విజయవాడ వెళ్లేందుకు వాహనాలను అద్దెకు ఇవ్వద్దని అనంతపురం జిల్లా ఉరవకొండలో నోటీసులు అందించినట్లు సమాచారం. ఇలా మొత్తం 55 మంది ప్రయివేటు వాహనదారులకు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఉరవకొండ సీఐ హరినాథ్ పేరుతో నోటీసులు జారీ చేసినట్లు ఉద్యోగులంటున్నారు. ప్రభుత్వ చర్యలను ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు హక్కు లేదా అని పలువురు ఉద్యోగులు ప్రశ్నించారు. వారం ముందు నుంచే ఉద్యోగ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.

సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీనిలో భాగంగా ఉద్యోగులు చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఉద్యోగులు పాల్గొనకుండా పోలీసు యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పోలీసులు వెళ్లి చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలకు హాజరు కావొద్దని ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి జారీ చేయలేదని.. అనుమతి లేకుండా ఈ కార్యక్రమాలకు హాజరు కావటం నేరపూరితమని పేర్కోంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం పేర్కోంది.

మరోవైపు ఈ ఆందోళన కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని మంత్రులు బొత్స, ఆర్ధిక మంత్రి బుగ్గన ఉద్యోగ సంఘ నేతలను కోరారు. ఇదే అంశంపై ఉద్యోగ సంఘ నేతలతో మంత్రులు చర్యలు జరుపుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.