ETV Bharat / city

AP LETTER TO KRMB: కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

AP LETTER TO KRMB
AP LETTER TO KRMB
author img

By

Published : Aug 25, 2021, 12:52 PM IST

Updated : Aug 25, 2021, 1:59 PM IST

12:47 August 25

కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణకు 70:30 నిష్పత్తిలో పంపకాలు చేయాలని కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ రాసింది. 50:50 శాతం నిష్పత్తిలో నీటి పంపకాలకు సంబంధించి బోర్డు రాసిన లేఖపై ఏపీ నీటిపారుదలశాఖ ఇంజినీర్​ ఇన్‌ చీఫ్‌ ప్రత్యుత్తరం పంపారు. 50శాతం నీటి పంపకాలు చేయాలంటూ తెలంగాణ రాసిన లేఖపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీ అభిప్రాయం కోరగా.. నీటిపారుదలశాఖ అధికారులు సమాధానమిచ్చారు. 

ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. నాగార్జునసాగర్​లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

పునర్విభజన చట్టంలో ఏపీ అవసరాల కోసం 1059 TMCలు కావాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దశలో 50ఛ50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదని ఏపీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి

Last Updated : Aug 25, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.