రాష్ట్రంలో కర్ఫ్యూ విధించే సమయంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు అన్ని రకాల కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ సడలింపు వేళల్లో యధావిధిగా కార్యకలాపాల నిర్వహాణకు అనుమతి మంజూరు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఇదీ చదవండి
SR GROUP : కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ సుముఖత