ETV Bharat / city

రూ.3 వేల కోట్ల రుణ సమీకరణకు సర్కార్ నిర్ణయం - Andhra Pradesh latest news

ఉద్యోగులకు జీతాల చెల్లింపులు, పథకాలకు నిధులు ఇలా అన్ని అవసరాలకూ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ​(ఎస్​డీసీ)ను ప్రభుత్వం ఆసరాగా మార్చుకుంటోంది. దీని ద్వారా మరో మూడు వేల కోట్ల రూపాయల్ని రుణంగా సమీకరించాలని నిర్ణయించారు. ఎస్​డీసీ ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తుండటం ఆర్థికశాఖను ఆందోళనలోకి నెడుతోంది.

Andhra Pradesh
Andhra Pradesh
author img

By

Published : Dec 17, 2020, 8:22 PM IST

రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తున్నా.. రుణాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్(ఎస్​డీసీ) ద్వారా మరో మూడు వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) నుంచి రుణంగా తీసుకోనున్నారు. ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలను ఎస్​డీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణ సమీకరణ చేసింది.

ఆర్థిక శాఖ ఆందోళన

మొత్తంగా 25 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక వనరుల్ని సమీకరించటం లక్ష్యంగా ఎస్​డీసీ ఏర్పాటైంది. అవసరమైనంత మేర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఈ కార్పొరేషన్​కు ఎస్​బీఐ ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. అలాగే మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు సమకూర్చాయి. ఇప్పుడు తాజాగా మరో 3 వేల కోట్లను ఎస్​బీఐ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ సంస్థ ఏర్పాటైన ఏడాదిలోపే ఇన్ని వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవటంపై ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది.

నిధుల వినియోగం ఇలా
ఎస్​డీసీ సమీకరించిన ఆర్థిక వనరుల నుంచి ఉద్యోగుల జీతాలతో పాటు కరోనా కారణంగా పెండింగ్​లో ఉంచిన 4300 కోట్ల రూపాయల జీతాల బకాయిలు చెల్లింపులు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలను కూడా 2021 జనవరి నుంచి ఈ నిధుల నుంచే చెల్లించనున్నారు. ఇక జనవరి 9 తేదీన అమ్మ ఒడి పథకం కింద 6100 కోట్ల రూపాయల్ని కూడా ఈ కార్పొరేషన్ నిధుల నుంచే సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నెల వారీగా ప్రభుత్వ ఆదాయం 11 వేల కోట్ల రూపాయలైతే... కేంద్రం నుంచి వచ్చే మరో 3 వేల కోట్ల రూపాయలతో కలిపి 14 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చులకు, పథకాలకు సర్దుబాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి

అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.