ఈ రోజు ఉదయం 11 గంటలకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ భవనంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు నామినేటెడ్ పోస్టుల వివరాలు వెల్లడిస్తారు. 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది.
వైకాపాకు తొలి నుంచి సేవలందించినా.. సముచిత న్యాయం జరగని నేతలకే పదవులు దక్కనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమిపాలై ఇప్పటి వరకు ఏ పదవీ దక్కని నేతలనే కార్పొరేషన్ ఛైర్మన్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలకు పదవులు దక్కనున్నాయి. చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్నవారు, సీనియర్ నేతలకు పెద్దపీట వేయనున్నారు. పదవుల్లో 50 శాతం మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం కేటాయించనున్నారు. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్‌పై సీఎం జగన్