ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26వ తేదీ ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు 25న ఆదివారం రావటంతో సోమవారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు.
మరోవైపు తెలంగాణలో విజయదశమి సెలవు 25కి బదులు 26కి మార్చింది తెరాస ప్రభుత్వం. గతంలో సెలవు 25గా పేర్కొంటూ జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. ఇకపై ఏటా దసరా మరుసటి రోజునూ సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి