రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని... కార్మిక శాఖ కమిషనర్ రేఖారాణి చెప్పారు. బలవన్మరణానికి పాల్పడిన వారిలో పోలేపల్లి వెంకటేశ్వరరావు, పడతపు వెంకట్రావు, చింతం బ్రహ్మాజీ, పటాస్ నాగుల్ మీరా, గుర్రం నాగరాజు ఉన్నారన్నారు. వారి నామినీలకు పరిహారం అందించినట్లు కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: