రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో... ప్రభుత్వం మార్పులు చేసింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంలో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ వ్యాజ్యానికి సంబంధించి.. అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ 13 సూచనలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలు సంపూర్ణంగా లేవని... పలు నొటిఫికేషన్లు జత చేయలేదని.. ప్రతివాదుల్లో విశ్రాంత న్యాయవాది పేరు చేర్చడం వంటి అంశాలపై... ప్రభుత్వం మార్పులు చేసినట్లు సమాచారం. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్-200ను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై.. విచారణ జరిపే అంశం న్యాయస్థానాల పరిధిలోకి రాదని.. పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వానిది విధానపర నిర్ణయమని.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. మరోవైపు ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై..... తమ వాదన వినకుండా ఎలాంటి తీర్పూ వెలువరించొద్దంటూ 5 కేవియట్ పిటిషన్లు దాఖలయ్యాయి
స్పెషల్ లీవ్ పిటిషన్‌లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం - స్పెషల్ లీవ్ పిటిషన్‌లో మర్పులు న్యూస్
ఎస్ఈసీ వ్యవహారంలో హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో రిజిస్ట్రీ సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. 13 లోపాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించి సూచన చేయగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పిటిషన్ లో మార్పులు చేర్పులు చేశారు. మరోవైపు ఈ పిటిషన్ పై తమ వాదనలు వినకుండా ఎలాంటి తీర్పూ ఇవ్వొద్దని 5 కేవియట్ పిటిషన్లు దాఖలయ్యాయి.