sinarage fees: రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ ఫీజు, కన్సిడరేషన్ నగదు వసూలు బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండర్లను గనులశాఖ మరోసారి పిలిచింది. ఈ నెల 27 వరకు టెండర్ల దాఖలుకు అవకాశమిచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ప్యాకేజీ-1, ఉభయగోదావరి జిల్లాలు ప్యాకేజీ-2, కృష్ణా, గుంటూరు ప్యాకేజీ-3, ప్రకాశం ప్యాకేజీ-4, నెల్లూరు, చిత్తూరు ప్యాకేజీ-5, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు ప్యాకేజీ-6గా ఈ టెండర్లు పిలిచారు.
ఇదీ చదవండి: