కౌలు సాగులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మొత్తం కమతాల్లో 42.4% కౌలు రైతుల కిందే ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో 36.4% మేర వీరే పండిస్తున్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో కౌలు సాగు లేదు. 2018 జులై నుంచి 2019 జూన్ మధ్య కేంద్ర గణాంకశాఖ నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగానూ కౌలు కమతాలు, విస్తీర్ణం పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
* తెలంగాణలో కౌలు కమతాలు 17.5% కాగా కౌలుకు చేసే భూమి 11.9%.
ఇదీ చదవండి: CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం