కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఇండెంట్ లేకుండా చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలన్నారు. సాగునీటి కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉందని.. శ్రీశైలం, సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున అనుమతి అవసరమని గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీ అనుమతితోపాటు ఏపీ ఇండెంట్ ఉంటేనే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయలేదని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే నీటి విడుదలకు ఆస్కారమని పేర్కొన్నారు. ఏపీ ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
'రాష్ట్ర విభజన తర్వాత విద్యుదుత్పత్తి స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయి. సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయి. రెండు ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు నీటి విడుదల యాదృచ్ఛికం. తెలంగాణకు రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాల్లేవు.'- లేఖలో పేర్కొన్న ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి.
ఇదీ చదవండి: