స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు తాము ఆశించినట్టుగా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని.. నిర్ణయించినట్టు చెప్పారు. రెండు నెలల్లో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని.. ఆ తర్వాత ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు. అప్పటివరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉందని.. అందుకే టీకా పంపిణీ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని కోరుతున్నట్లు చెప్పారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే చాలామంది సెలవుల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. వేల మంది ఉద్యోగులకు కరోనా సోకిందని.. వందల మంది మరణించారని అన్నారు.
ఇదీ చదవండి: