రాష్ట్రంలో కొత్తగా 10,413 కరోనా(corona) కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కరోనా నుంచి మరో 15,649 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ను జయించిన వారి సంఖ్య 15,93,921గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,075 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1,574, అనంతపురంలో 865, గుంటూరులో 686, కడపలో 610, కృష్ణాలో 692, కర్నూలులో 425, నెల్లూరులో 527, ప్రకాశంలో 631, శ్రీకాకుళంలో 427, విశాఖపట్నంలో 634, విజయనగరంలో 293, పశ్చిమగోదావరిలో 974 మందికి కరోనా నిర్ధరణ అయింది.
జిల్లాల వారీగా కరోనా మరణాలు...
కరోనాతో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది, పశ్చిమగోదావరిలో 11, అనంతపురంలో 8, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో 7 గురు చొప్పున మృత్యువాత పడ్డారు. గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 6గురు చొప్పున మహమ్మారికి బలయ్యారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో 5, నెల్లూరులో 4, ప్రకాశంలో 3, కడప జిల్లాలో ఒకరు చనిపోయారు.
ఇదీ చదవండి: Pawankalyan: కారా మాస్టారు పేరు చెప్పగానే 'యజ్ఞం' గుర్తుకొస్తుంది: పవన్