రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,620 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి.. 7,96,919 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఇప్పటివరకు 6,524 మంది మృతి చెందారు. ప్రస్తుతం 32,257 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 7,58,138 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 76,726 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 73.47 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.
జిల్లాలవారీగా కరోనా మృతులు..
కరోనాతో గుంటూరులో 4, చిత్తూరులో 2, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కృష్ణాలో 2, ప్రకాశంలో 2, అనంతపురంలో ఒకరు చనిపోయారు. మహమ్మారితో కడప, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
జిల్లాల్లో కేసులు
గత 24 గంటల్లో... పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 631 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 492, చిత్తూరులో 412, గుంటూరులో 385 కొవిడ్ కేసులు వచ్చాయి. కృష్ణాలో 370, ప్రకాశంలో 311, కడపలో 212, అనంతపురంలో 196, విశాఖలో 171, నెల్లూరులో 126, శ్రీకాకుళంలో 126, విజయనగరంలో 122, కర్నూలులో 66 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు.
ఇదీ చదవండి : నిధుల కోసం.. ఎస్ఈసీ పిటిషన్పై తీర్పు రిజర్వ్