రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ ఒక నిర్ణయానికి రాలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, సీనియర్ నేత కనుమూరి బాపిరాజు తెలిపారు. పార్టీ నిర్ణయం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని విజయవాడలో స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం... తమ పార్టీ నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమన్నారు.
ఇదీ చదవండి : ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్