CM Special Secretary on bank loans: ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై గత కొంత కాలంగా దుష్ప్రచారం జరుగుతోందని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా చూడడం ద్వారా ప్రభుత్వం ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెదేపా హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉందని వెల్లడించారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 5484.28 శాతం మేర రెవెన్యూ లోటు వచ్చిందని.. ఇవన్నీ కాగ్ చెప్పిన లెక్కలేనని స్పష్టం చేశారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడే గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు ఉందన్నారు. పెండింగ్ బకాయిలు 39 వేల కోట్లు.., హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద 58 వేల కోట్లు తీసుకుందని తెలిపారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు రూ. 5 వేల కోట్లు ఒకేసారి అప్పు తీసుకుందని.. ఇలా ఒకే రోజున ఈ స్థాయిలో అప్పు తీసుకున్న సంఘటనలు లేవని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం.. రూ. 1.27 లక్షల కోట్లు డీబీటీల రూపంలో అవినీతి లేకుండా పేదలకు పంపిణీ చేసిందని దువ్వూరి కృష్ణ తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది ఎఫ్ఆర్బీఎం పరిధిని మించే అప్పులు చేశారని చెప్పారు. గత ప్రభుత్వం పరిధికి మించి చేసిన అప్పుల వల్లే.. కేంద్ర ఆర్థిక శాఖ 16,418.99 కోట్లు కోత విధించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల కాలంలో 17.33 శాతం మేర అప్పులు పెరిగాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 14.88 శాతం మేర మాత్రమే అప్పులు పెరిగాయని వివరించారు.
"రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చే యత్నం. సవ్యంగా ఉన్నప్పుడే గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలు రూ.39 వేల కోట్లు. ఎన్నికలకు ఒకరోజు ముందు రూ.5 వేల కోట్లు అప్పు చేశారు. గత ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిధిని మించి అప్పులు చేసింది. గత అప్పుల వల్ల కేంద్ర ఆర్థికశాఖ రూ.16,418 కోట్లు కోత పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో 17.33 శాతం అప్పులు పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక 14.88 శాతం అప్పులు పెరిగాయి. డీబీటీల రూపంలో పేదలకు రూ.1.27 లక్షల కోట్లు పంపిణీ చేశాం. రాష్ట్రంలో ఉత్పాదకత లేక ఇబ్బందులు తలెత్తాయి" - దువ్వూరి కృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి
ఇదీ చదవండి
Actor Ali Meet CM YS Jagan: 'టికెట్ ఇచ్చినా వద్దని చెప్పా.. త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన'