మంచినీటిని ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాగునీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధ జలాల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన సముద్రజలాలను అందించాలని స్పష్టం చేశారు. డీశాలినేషన్ ప్లాంట్లను ప్రమోట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలన్నారు. రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను ఆదా చేయాలన్న ఆయన.. పరిశ్రమలకు నీటిని అందించే బాధ్యత ఏపీఐఐసీదేనని స్పష్టం చేశారు.
సముద్రతీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తెలిపారు. పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించి పరిశ్రమలకు అందేలా చూడాలన్నారు. సమన్వయ బాధ్యత ఏపీఐఐసీ చేపట్టాలని.. సాగుకు వాడే నీటిని పరిశ్రమలు వాడకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయాల ద్వారా నీరు ఇవ్వడంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి