ETV Bharat / city

'కొవిడ్​ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి' - corona outbreak status in ap news

రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా.. వైద్య సేవలందించేందుకు వీలుగా కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులపై పని భారం లేకుండా.. బాధితులందరికీ ఉన్నత సేవలందేలా.. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. కరోనా పట్ల ప్రజల్లో ధైర్యం నింపాలని సూచించారు.

'కొవిడ్​ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి'

author img

By

Published : Jul 20, 2020, 10:28 PM IST

రాష్ట్రంలో కరోనా నివారణ కోసం... ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంచాలని అధికారులను నిర్దేశించారు. వైద్యులపై పనిభారం పడకుండా నాణ్యమైన సేవలందించాలని నిర్ణయించారు. జిల్లాల్లోని 84 కొవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ రాయితీలు అందించనుంది. ఆయా ఆసుత్రుల్లో ఏం చేయాలన్న దానిపై 2 రోజుల్లో నివేదిక తయారు చేయాలని చెప్పారు.

వైద్య సిబ్బందిని నియమించండి

5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ... నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని చెప్పారు. కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏంచేయాలి..? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహనకు భారీగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లకు వైద్య సాయంలో ఆలస్యం వద్దని స్పష్టం చేశారు.

వైద్యరంగంలో నాడు - నేడుపై దృష్టి

టెలీ మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ.. మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా..? లేదా..? అనేది మరోసారి పర్యవేక్షణ చేయాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. వైద్యరంగంలో చేపట్టనున్న నాడు – నేడు కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలని.. ఇవి పూరైతేనే కరోనా వంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలమని చెప్పారు.

85 శాతం మందికి ఇళ్లల్లోనే నయం అవుతుంది

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజల్లో ధైర్యం నింపాలని సీఎం జగన్​ అధికారులకు నిర్ధేశించారు. కరోనా‌ ఎవరికైనా రావొచ్చని.. 85 శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగేలా బహిరంగ ప్రదేశాలు, గ్రామ సచివాలయాల్లోనూ హోర్డింగ్స్​ పెట్టాలని సూచించారు. క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య కన్నా వాటిలో నాణ్యతపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

'కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు.. ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.