ETV Bharat / city

'కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు.. ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యం'

author img

By

Published : Jul 20, 2020, 8:50 PM IST

రాష్ట్రంలో కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకు సీఎం జగన్​ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే 24 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగా మరో 28 ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే ఈ కార్పొరేషన్ల ప్రధాన బాధ్యత కావాలని అధికారులకు నిర్దేశించారు.

'కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు.. ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యం'
'కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు.. ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యం'

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 28 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 24 బీసీ కార్పొరేషన్లు ఉండగా మరో 28 ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పెంపుతో రాష్ట్రంలో 139 బీసీ కులాలకు సంబంధించి.. 52 కార్పొరేషన్లు పని చేయనుండగా... ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లను భర్తీ చేయాలని సీఎం చెప్పారు. కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన జగన్‌.... జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై చర్చించారు. సమగ్ర అధ్యయనం చేసి.. మొత్తం 52 కార్పొరేషన్లు ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

7 నుంచి 12 మంది డైరెక్టర్లు

ప్రతి కార్పొరేషన్‌లో.. 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. కులాల అభివృద్ధి కోసం కష్టపడేవారికి పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. ఆయా కార్పొరేషన్లు... తమ పరిధిలోని బీసీలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా.... లేదా అనే అంశాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

18 నెలల్లో నైపుణ్యాభివృద్ధి కళాశాలలు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో తేనున్న నైపుణ్యాభివృద్ధి కళాశాలలను 18 నెలల్లో నెలకొల్పే విధంగా కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా లబ్ది కలిగే విధంగా చూడాలని‌ సూచించారు.

ఇదీ చూడండి..

బంధువులు చేయలేమన్నారు... పోలీసులు చేసి చూపించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.