ETV Bharat / city

CM Jagan: సీఎం జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై నేడు విచారణ

author img

By

Published : Jun 14, 2021, 5:45 AM IST

హైదరాబాద్​లోని​ సీబీఐ కోర్టులో నేడు సీఎం జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. జగన్​ బెయిల్​ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​పై విచారించనున్నారు.

cm jagan
జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ

ముఖ్యమంత్రి జగన్(CM Jagan) బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuram Krishna Raju) దాఖలుచేసిన పిటిషన్‌పై... హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. కౌంటరులో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామరాజు కోర్టుకు సమాధానం ఇవ్వనున్నారు.

బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలుచేశారు. బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని... రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారని జగన్ పేర్కొన్నారు. తనపై ఉన్న సీబీఐ కేసులను రఘురామరాజు ప్రస్తావించలేదన్నారు. ఈ కేసులో సీబీఐ(CBI) తటస్థ వైఖరితో మెమో దాఖలు చేసింది. పిటిషన్‌లోని అంశాలపై చట్టపరంగా, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. కౌంటర్లపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఈనెల 1న రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేష్ కోరగా.. విచారణ నేటికి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

Nominated Posts: త్వరలో 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.