CID Notice To RRR: హైదరాబాద్‌లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు.
నేడు భీమవరం రావట్లేను.. అభిమానులు సహకరించాలి: ఎంపీ రఘురామ
గురువారం భీమవరం రాలేనని అభిమానులకు ఎంపీ రఘురామ అన్నారు. విజయవాడ విమానాశ్రయం వద్దకు ఎవరూ రావొద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై కొత్తగా కేసులు పెట్టిందని... అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలున్నా అందరం సంక్రాంతి జరుపుకుందామన్నారు. రామరాజ్యం కోసం పనిచేద్దామని రఘురామకృష్ణరాజు అన్నారు. తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు.. గురువారం రానున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. అయితే సీఐడీ నోటీసులు, తదితర కారణాల నేపథ్యంలో భీమవరం రావట్లేదని తెలిపారు.
ఇదీ చదవండి: