ETV Bharat / city

స్థానిక ఎన్నికలపై తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదం - ap assembly latest news

స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రవేశపెట్టగా..ఆర్థిక మంత్రి బుగ్గన బలపరిచారు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగీవ్రంగా ఆమోదించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ap-assembly-
ap-assembly-
author img

By

Published : Dec 4, 2020, 10:41 PM IST

Updated : Dec 5, 2020, 7:15 AM IST

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష తెదేపా లేకుండానే సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఎన్నికలు నిర్వహించలేం...

పీటీఐ కథనం ప్రకారం.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తీర్మానంలో పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిపింది. కరోనా రెండో దశ పొంచి ఉందని.. ఇలాంటి స్థితిలో ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని వివరించింది.

ఎన్నికలు నిర్వహించేందుకు ఐదు లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని అయినప్పటికీ, వారు ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని వెల్లడించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం- 1994లో తగు మార్పులు చేయాల్సి ఉందని తీర్మానంలో ప్రస్తావించింది. తెదేపా సభ్యులు అంతకుముందే సభ నుంచి వాకౌట్ చేశారు. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

ఇదీ చదవండి

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం...హైకోర్టుకు నివేదించిన ఎస్​ఈసీ

Last Updated : Dec 5, 2020, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.