ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ముఖ్యవార్తలు

.

AP TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 4, 2022, 8:59 PM IST

  • పొత్తులపై పవన్​ కీలక వ్యాఖ్యలు
    రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలే ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వికేంద్రీకరణ పేరుతో రాజధానిని 3 ముక్కలు చేయొద్దు: మేధావులు
    రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 'అమరావతిపై హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' అనే అంశంపై విజయవాడలో మేధావుల చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాజధానిని ఓ కులానికి అంటగట్టి మాట్లాడటం చాలా శోచనీయమని ప్రభుత్వంపై మేధావులు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హత్యల వెనుక.. ఆ ఎమ్మెల్యే హస్తం : చంద్రబాబు
    "ఆస్పత్రి నుంచి జల్లయ్య మృతదేహం ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా?" అని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పిఠాపురంలో ఉద్రిక్తంగా తెదేపా దళిత గర్జన..
    పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఈరోజు తెదేపా దళిత గర్జనకు పిలుపునివ్వడంతో శుక్రవారం రాత్రి నుంచే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మైనారిటీ చట్టం నిబంధనలు సవాల్​ చేస్తూ సుప్రీంలో పిటిషన్​
    మైనారిటీ చట్టం సెక్షన్ 2సీ చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్​.. 8 మంది మృతి
    రసాయన పరిశ్రమలో బాయిలర్​ పేలి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన ఉత్తర్​ప్రదేశ్​, హాపుడ్​ జిల్లాలో జరిగింది. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర.. ఆపేదే లేదన్న పుతిన్
    ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో వినాశనం చోటుచేసుకుంది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసపోయారు. మరోవైపు, ఈ యుద్ధం ఆపేది లేదంటూ రష్యా అధినేత పుతిన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెజాన్​ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​ రాజీనామా
    అమెజాన్​లో తన 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు సంస్థ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​. ఈ మేరకు ఆయన సంస్థను వీడుతున్నట్లు అమెజాన్​ సీఈఓ ఆండీ జాస్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ మరోసారి స్వైటెక్​ సొంతం
    ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ స్వైటెక్​ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్​ను ఓడించి మరోసారి టైటిల్​ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మేజర్' టీమ్​​ కీలక ప్రకటన.. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం
    'మేజర్‌' చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.